Home గాసిప్స్ విజయ్ నెక్స్ట్ మూవీ….ఊరమాస్ డైరెక్టర్ తో…!!

విజయ్ నెక్స్ట్ మూవీ….ఊరమాస్ డైరెక్టర్ తో…!!

0

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం సౌత్ మొత్తం మీద అల్టిమేట్ ఫామ్ లో ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ముందు నిలిచే హీరో. లాస్ట్ మూడు సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ విజయాలను నమోదు చేయగా మినిమమ్ 200 కోట్లకు తగ్గని గ్రాస్ కలెక్షన్స్ తో మిగిలిన హీరోలను కూడా బీట్ చేసే రేంజ్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు విజయ్. అందులో సర్కార్ సినిమా…

మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది, ఇక ఇప్పుడు కార్తీ కి ఖైదీ తో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో కలిసి మాస్టర్ సినిమా చేసిన విజయ్ ఈ సినిమా ను ఈ పాటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా…

లాక్ డౌన్ వలన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే, కానీ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండగా ఈ సినిమా తర్వాత తిరిగి మురగదాస్ డైరెక్షన్ లో తుపాకీ 2 సినిమా చేయబోతున్నాడు విజయ్.

ఇక ఈ సినిమా తో పాటు మరో ఊరమాస్ మూవీ ని కమిట్ అయ్యాడని కోలివుడ్ లో సాలిడ్ టాక్ వినిపిస్తుంది. కాంచన సిరీస్ తో తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో విజయ్ అప్ కమింగ్ మూవీ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో టాక్ ఓ రేంజ్ లో వినిపిస్తుంది.

రీసెంట్ గా విజయ్ కి లారెన్స్ చెప్పిన కథ బాగా నచ్చడం తో మురగదాస్ తర్వాత ఇదే సినిమా చేయాలని విజయ్ భావిస్తున్నట్లు టాక్. లారెన్స్ సినిమాలకు తెలుగు లో కూడా సాలిడ్ క్రేజ్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే తెలుగు లో విజుయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here