Home గాసిప్స్ 7 రోజులు మాత్రమె…అసలు క్లారిటీ లేదుగా!

7 రోజులు మాత్రమె…అసలు క్లారిటీ లేదుగా!

0

 సోషల్ మీడియా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయ్యారు, ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నారు, ఇక అరవింద సమేత తర్వాత సోలో మూవీ కాకుండా రామ్ చరణ్ తో జక్కన్న డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ముల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో బిజీ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మరో వారం లో రాబోతుంది.

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా లో రామ్ చరణ్ లుక్ ని తర్వాత ఇంట్రో టీసర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు రావడం తో ఎలాంటి సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తారో అనుకున్న టైం లో లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన…

బయటికి వెళ్లి షూటింగ్ చేయడం కష్టమే అని తేలడం తో అసలు ఎన్టీఆర్ బర్త్ డే కి టీసర్ ఉంటుందో ఉండదా అన్న డౌట్లు నెలకొన్నాయి. దాంతో యూనిట్ నుండి సినిమా లో షాట్స్ ని టీసర్ లా కట్ చేస్తామని వార్తలు వచ్చినప్పటికీ సినిమా లో వేరే ఫూటేజ్…

కూడా లీక్ అయ్యే అవకాశం ఉండటం తో డౌట్ లో పడ్డారు యూనిట్, దాంతో ఇప్పటి వరకు టీసర్ పై అసలు క్లారిటీ లేకుండా పోయింది. సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా టీసర్ కట్ చేసి రిలీజ్ చేస్తే తప్పితే ఎన్టీఆర్ బర్త్ డే కి టీసర్ ఉండే అవకాశం ఇప్పుడు చాలా తక్కువే అని ఇండస్ట్రీ లో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సినిమా లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మట్టుకు రిలీజ్ అవ్వడం మాత్రం ఖాయమని అంటున్నారు, ఆ లుక్ తోనే టీసర్ ని మరిపించే లా ప్లాన్ చేయాలనే ఆలోచన లో కూడా ఉన్నారని తెలుస్తుంది, మరి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ నుండి ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు కానీ మరో రెండు మూడు రోజుల్లో అప్ డేట్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here