ఆడియన్స్ నుండి అత్యంత ప్రేమా అభిమానాలు సొంతం చేసుకున్న హీరో పై ఒక్కసారిగా వ్యతిరేకత వస్తే ఎలా ఉంటుంది, ఇక నీ సినిమాలు చూడం నిన్ను బాయికాట్ చేస్తాం అంటూ నేషనల్ వైడ్ ట్రెండ్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు కోలివుడ్ లో ఒక్కో అడుగు ఎదిగిన హీరో విజయ్ సేతుపతి కి ఎదురు అయ్యాయి. దానికి కారణం 800 అనే సినిమా… ఈ సినిమా వలన ఎంతో ప్రేమించే తమిళ్ ఆడియన్స్….
విజయ్ సేతుపతిని రెండు మూడు రోజులుగా నేషనల్ వైడ్ గా ట్రోల్ చేస్తున్నారు… శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తుండటం రీసెంట్ గా సినిమాను అనౌన్స్ చేసి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది…
అప్పటి నుండి నాన్ స్టాప్ గా తమిళ్ ఆడియన్స్ సినిమా ను విజయ్ సేతుపతి ని వ్యతిరేకించడం మొదలు పెట్టగా పరిస్థితి మరీ తీవ్ర రూపం దాల్చడం తో ముత్తయ్య మురళీధరన్ ఈ సినిమా నుండి విజయ్ నువ్వు తప్పుకో అంటూ ఓపెన్ లెటర్ రాశారు… దానికి విజయ్ సేతుపతి ఎంతో భాధతో అర్ధం చేసుకున్నందుకు…
థాంక్స్ అంటూ కామెంట్ చేయగా అప్పటికి గానీ శాంతించలేదు కోలివుడ్ ఆడియన్స్… దీనంతటికీ కారణం శ్రీలంక ప్రభుత్వానికి, ఎల్టీటీఈకి సుదీర్ఘకాలం పాటు జరిగిన యుద్ధం 2009లో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి ముత్తయ్య మురళీధరన్ మద్దతు పలకడం వివాదాస్పదంగా మారింది. దాన్ని తమిళ్ ఆడియన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి వ్యక్తీ బయోపిక్ లో ఇప్పుడు విజయ్ సేతుపతి నటిస్తుండటంతో…
తట్టుకోలేక నేషనల్ వైడ్ యాంటీ ట్రెండ్స్ చేయడం మొదలు పెట్టారు. ఇటు మురళీధరన్ కూడా తన లైఫ్ లో తాను పడ్డ కష్టాలను ఎదిరించి ఎలా ఈ స్థాయికి వచ్చానో అందరికీ చెప్పాలి అనుకున్నాని, ఇలా నా వల్ల ఒక హీరో కెరీర్ పాడవ్వడం ఇష్టం లేక విజయ్ ని తప్పుకోమన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ బయోపిక్ ఉంటుందా ఆపేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.