బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత హృతిక్ రోషన్ హీరోగా ఒప్పుకున్న సినిమా విక్రమ్ వేద. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీ లో ఇదే పేరుతొ రీమేక్ చేస్తూ ఉండగా మరో రోల్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే సొంతం చేసుకుంది కానీ ఇప్పుడు రిలీజ్ కి ముందు సినిమా కి ఓవరాల్ బజ్ మాత్రం అంతంత మాత్రమే ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దాంతో సినిమా ఓపెనింగ్స్ కూడా మరీ అద్బుతం అనిపించే విధంగా అయితే ఏమాత్రం ఉండదని అంటున్నారు… ప్రజెంట్ బుకింగ్స్ స్టేటస్ ను చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు ఇండియాలో అటూ ఇటూగా 15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
వార్ మూవీ ఓపెనింగ్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేసింది కానీ విక్రమ్ వేద మాత్రం ఓపెనింగ్స్ చాలా నార్మల్ గానే ఉండేలా ఉన్నాయి. ఇక టాక్ బాగుంటే సినిమా వీకెండ్ లో జోరు చూపించి తర్వాత దసరా హాలిడేస్ లో జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.