Home న్యూస్ 100 కోట్ల సినిమా…తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

100 కోట్ల సినిమా…తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

0

కన్నడ బాద్ షా కిచ్చ సుదీప్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనా… ఫాంటసీ నేపధ్యంలో అడ్వెంచురస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పై కన్నడలో మంచి అంచనాలు ఉండగా ఇతర భాషల్లో కూడా డీసెంట్ అంచనాలు ఏర్పడగా సినిమాలో రక్కమ్మ సాంగ్ సినిమా పై బజ్ ని మరింతగా పెంచేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనిపించిన ఈ సినిమా 28న గ్రాండ్ గా…

ఇండియాలో అన్ని మేజర్ భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా తెలుగు రాష్ట్రాల ఓవరాల్ బిజినెస్ 1.25 కోట్ల రేంజ్ లో సొంతం అయినట్లు సమాచారం. దాంతో సినిమా తెలుగు లో ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే….

1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ డీటైల్స్ కరెక్ట్ గా రివీల్ అవ్వాల్సి ఉండగా ఎక్కువ శాతం నాన్ థియేట్రికల్ రైట్స్ తో రికవరీ అవ్వడంతో బిజినెస్ కొంచం రీజనబుల్ గానే జరిగిందని అంటున్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుని మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here