Home గాసిప్స్ మెగా పవర్ స్టార్ జూలు విదిల్చాడు…ఆ ఏరియాలో భీభత్సమే!!

మెగా పవర్ స్టార్ జూలు విదిల్చాడు…ఆ ఏరియాలో భీభత్సమే!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మాస్ లో బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా టీసర్-ట్రైలర్ సృష్టించిన భీభత్సం కావచ్చు….లేక సాంగ్స్ కి వస్తున్న అద్బుతమైన రెస్పాన్స్ కావచ్చు…ఈ సినిమా కి ఇప్పుడు అన్ని ఏరియాలలో అదిరి పోయే బిజినెస్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి.

కాగా ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు ఫైనల్ అవుతూ వస్తుండగా సినిమాకి కృష్ణా ఏరియాలో బిజినెస్ ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యింది. కాగా సినిమా అక్కడ ఓ రేంజ్ లో కుమ్మేసింది అనే చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ రేటు దక్కించుకుంది ఈ సినిమా.

ఓవరాల్ గా 5.6 కోట్ల రేటు ని కృష్ణా ఏరియాలో దక్కించుకుందట ఈ సినిమా. ఇది GST తో కలిపా లేకుండానా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ కూడా సినిమా షూటింగ్ జరిగిన నేపధ్యంలో సినిమా అక్కడ ఓ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here