Home న్యూస్ వినయ విధేయ రామ టీసర్ రివ్యూ…మళ్ళీ 100 కోట్లు ఖాయమా?

వినయ విధేయ రామ టీసర్ రివ్యూ…మళ్ళీ 100 కోట్లు ఖాయమా?

0

    ఈ ఇయర్ రంగస్థలం సినిమాతో తెలుగు నాట వన్ ఆఫ్ ది బెస్ట్ మౌత్ టాక్ ఉన్న మూవీ తో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ హిస్టారికల్ విజయం తర్వాత చేస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను తో మొట్టమొదటి సారి రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత….

వస్తుండటంతో అంచనాలు తారా స్థాయి కి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కానీ విధంగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు సినిమా అఫీషియల్ టీసర్ ని కూడా రంగం లోకి దింపారు.

 సినిమా అఫీషియల్ టీసర్ ఇటు బోయపాటి మార్క్ మిస్ కాకుండా అటు రామ్ చరణ్ మాస్ ఫ్యాన్స్ కి అల్టిమేట్ ట్రీట్ గా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. మెగా పవర్ స్టార్ న్యూ లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ టీసర్ కి మెయిన్ హైలెట్ గా నిలవడం విశేషం.

ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అని చెప్పాలి. టీసర్ షాట్స్ చూస్తుంటే బోయపాటి సినిమాలో ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఎన్ని పెట్టి ఉంటాడో అన్న ఆసక్తి కలిగిస్తుంది ఈ సెన్సేషనల్ టీసర్… మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఈ టీసర్ తో…

ఇప్పుడు సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి అనే చెప్పాలి. ఇక సినిమా సాంగ్స్ కూడా పర్వాలేదు అనిపించి సినిమా జస్ట్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నా సంక్రాంతి వీకెండ్ లో భీభత్సమైన కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు. మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here