రంగస్థలం లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ వినయ విదేయ రామ పై అంచనాలు పీక్స్ లో ఉండేవి. కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా బిజినెస్ పరంగా మాత్రం సినిమా దుమ్ము లేపింది. శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఏకంగా 18 కోట్ల రేటు చెల్లించి దక్కించుకుంది.
కానీ సినిమా ను టెలికాస్ట్ చేయడానికి 10 నెలల టైం తీసుకుంది, కానీ సినిమా రిలీజ్ అయిన నెలన్నర లోపే అమెజాన్ ప్రైమ్ లో మాస్టర్ ప్రింట్ రిలీజ్ చేశారు. అప్పటి నుండే సినిమా స్త్రీం అవుతున్నా 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ మా మాత్రం ఊరికే చూస్తూ ఉంటూ సినిమాను….
ఎట్టకేలకు రీసెంట్ గా టెలికాస్ట్ చేసింది, ఫలితం TRP రేటింగ్ పరంగా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన సినిమాను టెలివిజన్ లో త్వరగా టెలికాస్ట్ చేసి ఉంటె మంచి TRP రేటింగ్ లు అయినా వచ్చేవి, కానీ లేట్ అవ్వడం తో ఈ సినిమా కి ఓవరాల్ గా…
కేవలం 7.9 TRP రేటింగ్ మాత్రమె దక్కింది… అది రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది లోవెస్ట్ TRP రేటింగ్ లు అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సమయం లో వేరే ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమా పై పడింది.
ఏది ఏమైనా ఛానెల్ సినిమా ను కొన్న 18 కోట్ల రేటు కి TRP రేటింగ్ పరంగా డిసాస్టర్ అనిపించే రేటింగ్ ని సొంతం చేసుకుంది వినయ విదేయ రామ సినిమా. డానికి మొత్తం క్రెడిట్ ఛానెల్ కి వెళ్ళినా ఓవరాల్ గా అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై కూడా వినయ విదేయ రామ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.