Home న్యూస్ బిగిల్-విజిల్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

బిగిల్-విజిల్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరుతొ డబ్ అయ్యి నేడు ఘనంగా రిలీజ్ అయ్యింది, సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 3300 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా ముందు ప్రీమియర్ షోల తో ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలకి ఫైనల్ గా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే…రౌడీ అయిన తండ్రి తన కొడుకుని ఫుట్ బాల్ ఆట లో గొప్పవాడిలా చూడాలి అనుకుంటాడు, కొడుకు బిగిల్ కూడా అలానే ఎదగగా అనుకోని కారణాల వల్ల ఫుట్ బాల్ ఆటని వదిలేసిన బిగిల్ మళ్ళీ కొన్ని కారణాల వల్ల కోచ్ అవతారం ఎత్తుతాడు…

తర్వాత ఏం జరిగింది, అసలు ఆటని ఎందుకు వదిలాడు.. తన తండ్రి ఏమయ్యాడు ఇలాంటి ప్రశ్నలకి జవాబు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సినిమా లో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో ఆకట్టుకున్నాడు… బిగిల్ గా మైకల్ గా తండ్రి రోల్ లో…

కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు… ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం సీన్స్ లో దుమ్ము లేపాడు, ఫైట్స్ అండ్ సాంగ్స్ లో డాన్స్ కూడా కుమ్మేశాడు, పూర్తిగా ఇది విజయ్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవాలి, ఇక హీరోయిన్ నయనతార రోల్ చిన్నదే అయినా ఆకట్టుకుంటుంది. ఇక లేడీ ఫుట్ బాల్ టీం లో ఉన్న అమ్మాయిలూ అందరు ఆకట్టుకున్నారు…

ఇతర పాత్రలు తమ పరిదిమేరకు ఆకట్టుకున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే రెహమాన్ పర్వాలేదు అనిపించే సంగీతం ఇవ్వగా బ్యాగ్రౌండ్ స్కోర్ మార్క్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుని సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరి పోయే విధంగా ఉంది.

సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉన్నాయి, విజువల్స్ అండ్ టేకింగ్ సినిమా లెవల్ ని మరింతగా పెంచేదిగా ఉంది, ఫుట్ బాల్ సెట్ మరీ అంత ఎఫెక్టివ్ గా లేకున్నా గ్రాండియర్ విషయం లో ఆదరగోట్టేశారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంది… కథ యిట్టె చెప్పే విధంగా ఉండటం… చాలా వరకు కథ….

బాలీవుడ్ లో వచ్చిన చక్ దే ఇండియా స్పూర్తిగా అనిపించడం ఈజీ గా కనిపెట్టవచ్చు. ఆ సీరియస్ కథ ని ఇక్కడ మార్చి దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు అనే విధంగా సినిమా ఉంటుంది. కానీ స్టొరీ యిట్టె చెప్పే విధంగా ఉండటం, స్క్ర్తీన్ ప్లే టేక్ ఆఫ్ అవ్వడానికి కొంత సమయం పట్టడం…

తర్వాత ఇంటర్వెల్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ మళ్ళీ లెంత్ అండ్ స్క్రీన్ ప్లే స్లో గా ఉండటం అలాగే రొటీన్ క్లైమాక్స్ ఎక్స్ పెర్ట్ చేసినట్లే ఉండటం మేజర్ డ్రా బ్యాక్స్… ఇక డైరెక్షన్ పరంగా సినిమా కి ఉన్న క్రేజ్ ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు కానీ పకడ్బందీగా కొత్త కథను రాసుకోలేదు… ముందుగా చెప్పినట్లే… చక్ దే ఇండియా సినిమా…

చాలా సార్లు మనకు గుర్తుకు వస్తుంది, దాన్ని కవర్ చేస్తూ సెకెండ్ ఆఫ్ ఆటల్లో ఆడవాళ్ళు ఎదురుకునే పరిస్థితులను ఎమోషనల్ గా టచ్ అయ్యేలా తీసి మెప్పించాడు కానీ ఆ డోస్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది, ఇక స్క్రీన్ ప్లే రొటీన్ గా రాసుకున్నా హీరో ని ప్రజెంట్ చేసిన…

విధానం, ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఇవ్వడం లో అట్లీ సక్సెస్ అయ్యాడు, కథ అండ్ స్క్రీన్ ప్లే పరంగా యావరేజ్ మార్కులు దక్కించుకున్నాడు. లెంత్ విషయం లో అలాగే స్క్రీన్ ప్లే విషయం లో మరింత శ్రద్ధ పెట్టి ఉంటె సినిమా రేంజ్ లో మరో లెవల్ లో ఉండి ఉండేది. ఇక ఓవరాల్ గా సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…

విజయ్ నటన, ప్రొడక్షన్ వాల్యూస్, హీరోయిజం సీన్స్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, తండ్రి రోల్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా… రొటీన్ స్టొరీ, లెంత్, స్క్రీన్ ప్లే ప్రిడిక్ట్ చేసే కథ మేజర్ డ్రా బ్యాక్స్ గా చెప్పుకోవాలి, అయినా కానీ ఫ్యాన్స్ రిపీట్స్ సీన్స్ ఇచ్చిన అట్లీ…

రెగ్యులర్ మూవీ గోర్స్ ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించాడు…కథ పరంగా మెర్సల్ అంత స్ట్రాంగ్ గా లేకున్నా హీరోయిజం సీన్స్ విషయంలో ఆ సినిమా కన్నా బెటర్ ఔట్ పుట్ ఇచ్చాడు.. దాంతో ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్….

Bigil-Whistle Total Worldwide Pre Release Business!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here