టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ ఏంటి అనేవి ఆల్ మోస్ట్ కన్ఫాం అయినా కానీ ఒకటి తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్నది మాత్రం ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉంది, ముందు ఒక లైనప్ అనుకున్నా కానీ అనుకున్న కథలను తెలుగు లో మార్పులతో చేయాలి అని ఫిక్స్ అవ్వడం తో సినిమాలు ఏవి ఇంకా కన్ఫాం అవ్వడం లేదు. ముందు లూసిఫర్ రీమేక్ ని తర్వాత బాబీ తో…
స్ట్రైట్ సినిమా ను తర్వాత మెహర్ రమేష్ తో వేదళం రీమేక్ ని అనుకున్నా ఆర్డర్ మారినట్లే మారుతుంది కానీ ఏది ఇప్పటికీ అఫీషియల్ గా కన్ఫాం లేదు, లూసిఫర్ రీమేక్ ని ముందు సుజీత్ తో అనుకున్నా ఆ మార్పులు చేర్పులు నచ్చక కథ ని వినాయక్ కి అప్పగించగా…
ఈ లోపు చిరు కి వేదళం రీమేక్ చేయాలి అని భావిస్తున్నా కానీ లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ మారితే ఏది బాగుంటే అది మొదలు పెట్టాలి అని భావిస్తున్నారు. ఇంతలో వినాయక్ లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ని తన స్టైల్ మార్పులు చాలా వరకు చేశారు అని సమాచారం.
ఆ మార్పులు సినిమా టెంపోని మార్చేసి వినాయక్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో రఫ్ఫాడించేలా స్క్రిప్ట్ రెడీ అయిందని చిరు కి చెప్పారట. ఇక చిరు ఇప్పుడు స్క్రిప్ట్ వినాల్సి ఉందని, కానీ ఎక్కడో ఈ సినిమా ప్లస్ లో ముందు వేదళం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో చిరు ఉన్నారని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
కానీ వినాయక్ చేసిన మాస్ మార్పులు ముందు విని తర్వాత నిర్ణయం తీసుకోవాలని చిరు భావిస్తున్నారట. మొత్తం మీద ఏ స్క్రిప్ట్ రెడీ అయినా కానీ ఆచార్య షూటింగ్ ముగిసిన తర్వాతే ఎదో ఒకటి మొదలు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. మరి చిరు ఫైనల్ గా ఏ సినిమా కి ఓటు వేస్తారో చూడాలి….