Home న్యూస్ అలా జరిగి ఉంటే…ఇక్కడ 100 కోట్లు వచ్చేవి నాకు – మంచు విష్ణు!!

అలా జరిగి ఉంటే…ఇక్కడ 100 కోట్లు వచ్చేవి నాకు – మంచు విష్ణు!!

0

రీసెంట్ టైం లో మంచు విష్ణు మాటలు ఎక్కువగా ట్రోల్ కి కారణం అవుతున్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మా ప్రెసిడెంట్ ఎలెక్షన్ టైం నుండి మీడియా తో ఎక్కువగా మాట్లుడుతున్న మంచు విష్ణు అప్పుడప్పుడు చేసే కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి. రీసెంట్ గా తన లేటెస్ట్ మూవీ జిన్నా సినిమా ప్రమోషన్స్ లో కూడా తను చేసిన కామెంట్స్ కొన్ని…

ట్రోల్ కి కారణం అయ్యాయి అని చెప్పాలి. అందులో ఇప్పుడు తన సినిమాలకు హిందీ లో అద్బుతమైన మార్కెట్ ఉందని, తెలుగు లో నుండి అక్కడ డబ్ అయిన మూవీస్ లో తన సినిమాలు టాప్ 3 లో ఒకటిగా నిలుస్తూ వస్తున్నాయని చెబుతూ…

అక్కడ వచ్చిన వ్యూస్ ఇక్కడ తెలుగు లో వచ్చి ఉంటే నాకు కనీసం 100 కోట్లు అయినా వచ్చి ఉండేవి అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఎక్కువ శాతం ఇవి ట్రోల్ కి కారణం అవుతున్నాయి…

ఎందుకంటే మంచు విష్ణు కన్నా కూడా ఇతర హీరోలు రామ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా ఇంకొంతమంది సినిమాలకు అక్కడ విపరీతమైన వ్యూస్ వచ్చాయి. వాళ్ళతో పోల్చితే మంచు విష్ణు మూవీస్ కి తక్కువ వ్యూస్ వచ్చాయి అనే చెప్పాలి. కానీ అక్కడ ఏకంగా ఇక్కడ ఈ రేంజ్ లో వచ్చి ఉంటె… 100 కోట్లు వచ్చి ఉండేవి అంటూ చేసిన కామెంట్స్ కొంచం ట్రోల్స్ చేసుకోండి అంటూ మంచు విష్ణునే ఇండికేట్ ఇచ్చినట్లు అవుతుంది…

ఈ కామెంట్స్ తో పాటు తన డైనమెట్ సినిమా హిందీ లో టాప్ 3 హైయెస్ట్ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న డబ్బింగ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ వస్తుందని తనకి ఢీ టైం నుండి హిందీ లో మార్కెట్ పెరిగింది అంటూ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ఇక జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here