యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) కి కోపం వచ్చింది, సోషల్ మీడియాలో తన సినిమా మీద ఓపెన్ స్టేట్ మెంట్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచాడు, దానికి కారణం తన కొత్త సినిమా అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) సినిమా గురించి…. కెరీర్ లో మాస్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా మీద…
డీసెంట్ అంచనాలు ఉన్నాయి, సాంగ్స్ బాగానే క్లిక్ అవ్వగా డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా డిసెంబర్ లో 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు…. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి… క్రిస్టమస్ టైంలో అనౌన్స్ చేసిన సినిమాల రిలీజ్ ల మీద ఎఫెక్ట్ పడింది…
పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ అయిన సలార్(Salaar) క్రిస్టమస్ కి రిలీజ్ ని కన్ఫాం చేసుకోవడంతో ఆ టైంలో రిలీజ్ అనుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన HI Nanna మరియు నితిన్(Nithiin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ ను ప్రీ పోన్ చేసుకుని డిసెంబర్ 7-8 టైంలో రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నాయి.
అన్ని సినిమాల పోస్టర్స్ మీద ఇవే డేట్స్ పెట్టగా అదే టైంలో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతూ ఉండటంతో ఆల్ మోస్ట్ 4 నోటబుల్ మూవీస్ ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉండటంతో… ఎవరు వెనక్కి తగ్గుతారా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా…
ఈ టైంలో అందరూ విశ్వక్ సేన్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవమని ప్రెజర్ పెట్టడంతో, ఓపెన్ గా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే అందరూ మన మీద ఎక్కాలని చూస్తారని, ఎంతో కష్టపడి చేసిన సినిమాను హిట్ అయినా ఫ్లాఫ్ అయినా అదే డేట్ కి రిలీజ్ చేస్తామని, లేదని పోస్ట్ పోన్ చేస్తే నేను ప్రమోషన్స్ కి రానని తేల్చేసి చెప్పాడు విశ్వక్ సేన్… మరి దీని మీద ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి ఇక….