టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara) భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సంక్రాంతికే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమా రిలీజ్ ను త్యాగం చేసిన మెగాస్టార్ ఈ సినిమాను…
ఈ సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు రిలీజ్ పై ఎలాంటి అప్ డేట్ లాంటివి లేక పోవడంతో అసలు సమ్మర్ లో కూడా సినిమా వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తూ ఉండగా..మరో పక్క సినిమా రిలీజ్ ఆలస్యానికి మేజర్ రీజన్ కూడా…
ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది…ఆ న్యూస్ ప్రకారం సినిమాకి మేకర్స్ భారీ రేటు పెట్టి నిర్మిస్తూ ఉండగా అదే రేంజ్ లో భారీ రేటుని డిజిటల్ నుండి రావాలని ఆశిస్తూ భారీ రేట్స్ ను కోట్ చేసి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు హాట్ స్టార్ లాంటివి బిగ్ ఓటిటి ప్లేయర్స్ కి చెప్పగా…
వాళ్ళ నుండి ఈ రేంజ్ రేటు ఇవ్వడానికి ఎలాంటి సమ్మతం కనిపించలేదట. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటివి ముందు ఒక రేటు కోట్ చేసినా ఇప్పుడు ఆ రేటు కూడా ఇవ్వలేమంటూ చెబుతూ ఉండటంతో ఓటిటి డీల్ ఫైనల్ అవ్వనిది విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం..
ఓ కొలిక్కి వచ్చే అవకాశం తక్కువే అని తెలుస్తుంది…మేకర్స్ రేటు ఏమైనా తగ్గించి ఎదో ఒక డీల్ ని ఒకే చేయడమో లేక కొత్త టీసర్ లాంటివి రిలీజ్ చేసి వంక పెట్టడానికి వీలు లేని విజువల్ వండర్ ను తీసుకు రాబోతున్నామని నిరూపించడమో చేస్తేనే సినిమా రిలీజ్ పై…
ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద వాల్తేరు వీరయ్యతో దుమ్ము లేపినప్పటికీ కూడా భోలా శంకర్ లాంటి డిసాస్టర్ ఇంపాక్ట్ విశ్వంభర మీద గట్టిగానే పడింది అని చెప్పాలి. వీటిని తట్టుకుని మెగాస్టార్ ఎలాంటి సక్సెస్ ను ఈ సినిమాతో సొంతం చేసుకుంటాడో చూడాలి.