Home న్యూస్ ఓరినీ….ఏకంగా 250 పెంచడం ఏంటి సామి…ఊహించలేదు అస్సలు!!

ఓరినీ….ఏకంగా 250 పెంచడం ఏంటి సామి…ఊహించలేదు అస్సలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం అంతంత మాత్రమే ఆడిన థియేటర్స్ రెండో వారంలో తేరుకోవడం చాలా కష్టమే అని చెప్పాలి. చాలా కొన్ని సినిమాలు మాత్రమే రెండో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా దసరా టైంలో…

ఆడియన్స్ ముందుకు వచ్చిన మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ కోసం…

ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా మొదటి వారం తర్వాత ఇప్పుడు రెండో వీకెండ్ లో ఊహించని విధంగా థియేటర్స్ కౌంట్ ను భారీ ఎత్తున పెంచుకుంది…అది 50 కాదు 100 కాదు…ఏకంగా 250 వరకు థియేటర్స్ కౌంట్ ఇప్పుడు పెంచుకుందట…

అసలు కలెక్షన్స్ లిమిటెడ్ గానే వస్తున్న సినిమాకి ఈ రేంజ్ లో థియేటర్స్ కౌంట్ పెరగడం అసలు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అని చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలా థియేటర్స్ పెరిగినా రెంట్స్ అండ్ మెయింటైనెన్స్ వెళ్ళాక షేర్ లెక్కలు కూడా తగ్గే అవకాశం ఉంది.

మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఈ పెరిగిన థియేటర్స్ అడ్వాంటేజ్ తో ఎంతవరకు కలెక్షన్స్ ని పెంచుకుంటుంది…ఎలాంటి షేర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టగలుగుందో చూడాలి ఇక. మొత్తం మీద క్లీన్ హిట్ అవ్వాలి అంటే మాత్రం ఇంకా చాలానే కష్టపడాల్సి ఉంటుంది సినిమాకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here