Home న్యూస్ రికార్డులకు ఇంతకుమించిన ఛాన్స్ లేదు…..ఇక రచ్చ ఖాయం!

రికార్డులకు ఇంతకుమించిన ఛాన్స్ లేదు…..ఇక రచ్చ ఖాయం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా ఈ సినిమా ఫస్ట్ బిగ్ రిలీజ్ అయినప్పటికీ కూడా ముందు అనుకున్న సినిమాల రిలీజ్ ల ప్రకారం విజయ్ నటించిన వారసుడు అలాగే అజిత్ కుమార్ ల తునివు సినిమాలు 11న రిలీజ్ కానుండగా….

12న వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ కానుండటంతో థియేటర్స్ మరీ ఎక్కువ కాకున్నా కానీ ఓవరాల్ గా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు లో రిలీజ్ ను…

3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు 14న రిలీజ్ కానుండటంతో 11న అజిత్ తెగింపు సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా 12న బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి….

దాంతో ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి బాలయ్య ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు వాడుకుని మంచి టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here