మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు వరుణ్ తేజ్… రీసెంట్ టైం లో చేసిన సినిమాలు వరుస పెట్టి ఫ్లాఫ్ అవ్వడం తో ఈ సినిమాతో ఎట్టి పరిస్థితులలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం….
ఎంతైనా ఉండగా సినిమా కోసం చాలా కష్టపడి లోకల్ టు నాన్ లోకల్ అన్ని చోట్లకు వెళుతూ సినిమాను ఎంత కుదిరితే అంత ప్రమోట్ చేసి ఇప్పుడు మార్చ్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు. కాగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా క్వాలిటీ అండ్ టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో…
సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టారు, ఎన్ని రోజుల్లో సినిమా షూటింగ్ లాంటివి కంప్లీట్ అయ్యాయి అన్నది ఆసక్తిగా మారగా సినిమాను మొత్తం మీద 75 వర్కింగ్ డేస్ లోనే టోటల్ షూటింగ్ మొత్తాన్ని డైరెక్టర్ కంప్లీట్ చేశారట. ఇలాంటి జానర్ మూవీస్ కి జనరల్ గా ఎక్కువ వర్కింగ్ డేస్ షూటింగ్ కి అవసరం అవుతూ ఉంటాయి.
కానీ ఆపరేషన్ వాలంటైన్ సినిమాను మొత్తం మీద 75 వర్కింగ్ డేస్ లోనే కంప్లీట్ చేయగా సినిమా కోసం మొత్తం మీద 46-50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ లో టాక్ ఉంది, ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫామ్ దృశ్యా ఈ రేంజ్ బిజినెస్ ఎక్కువే అనే చెప్పాలి, కానీ సినిమా కి చాలా మొత్తం ఇప్పుడు…
నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవరీ అయ్యిందని అంటున్నారు. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన మొత్తాన్ని రికవరీ చేస్తే మేకర్స్ ప్రాఫిట్ జోన్ లో నిలిచే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని మార్చ్ 1న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.