Home న్యూస్ డిసాస్టర్ మూవీ కి సెన్సేషనల్ శాటిలైట్ రైట్స్…రేటు చూసి టాలీవుడ్ షాక్!

డిసాస్టర్ మూవీ కి సెన్సేషనల్ శాటిలైట్ రైట్స్…రేటు చూసి టాలీవుడ్ షాక్!

0

లేడీ సూపర్ స్టార్ అనుష్క, మాధవన్, అంజలి, శాలిని పాండే ల కాంబినేషన్ లో ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవ్వకుండా ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి ఆగిపోతూ వస్తున్న సినిమా నిశ్శబ్దం ఎట్టకేలకు రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా అమెజాన్ ఒరిజినల్స్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద 23 కోట్ల రేంజ్ రేటు కి అమ్ముడు పోయింది.

సినిమా బడ్జెట్ 30 కోట్లు కాగా సినిమాను 23 కోట్లకు అమెజాన్ ప్రైమ్ లో అమ్మగా సినిమా ఇతర రైట్స్ అమెజాన్ ఒరిజినల్ కాబట్టి ఇవ్వరు, కానీ టీం కి అమెజాన్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ మళ్ళీ జరిగాయో తెలియవు కానీ సినిమా కి ఇప్పుడు శాటిలైట్ రైట్స్….

ఊహకందని రేటు కి అమ్ముడు పోయి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఆడియన్స్ ను అసలు ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక నిరాశ పరిచిన ఈ సినిమా రీసెంట్ డైరెక్ట్ రిలీజ్ మూవీస్ లో వీకేస్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ లో ఒకటిగా అందరూ విమర్శలను గుప్పించారు.

కానీ అదే సమయం లో అమెజాన్ ప్రైమ్ లో సినిమా కి సాలిడ్ గా వ్యూస్ దక్కగా సినిమా చాలా వరకు అమౌంట్ ని రికవరీ చేసింది, ఇక ఇప్పుడు సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని విధంగా నిశ్శబ్దం సినిమాకి…. 8.2 కోట్ల రేంజ్ లో రేటు కేవలం తెలుగు….

శాటిలైట్ రైట్స్ నుండి సొంతం అయినట్లు సమాచారం… ఇది ఆల్ మోస్ట్ మీడియం టు కొన్ని హై బడ్జెట్ మూవీస్ కి దక్కే శాటిలైట్ రైట్స్ రేటు అని చెప్పాలి. ఇక ఎలాగూ తెలుగు లో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి కాబట్టి ఇతర భాషల శాటిలైట్ రైట్స్ కూడా ఇక అమ్మకం జరగడం ఖాయం కాబట్టి ఇటు యూనిట్ అటు ప్రైమ్ సేఫ్ అయ్యే అవకాశం తో పాటు లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here