టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది రంగస్థలం సినిమా తో అల్టిమేట్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే, ఆ ఊపుతోనే రామ్ చరణ్ బోయపాటి ల సినిమా కి అల్టిమేట్ క్రేజ్ ఏర్పడి అన్ని ఏరియా లలో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ జరగగా నైజాం ఏరియా కి గాను ఈ సినిమా ను దిల్ రాజు ముందు ఏకంగా 24 కోట్ల బిజినెస్ రేటు ఇచ్చి కొన్నాడు.
కానీ అందులో ముందుగా 4 కోట్లు రికవరీ కండీషన్ పెట్టగా తర్వాత మళ్ళీ జరిగిన ఒప్పందం తో సినిమా బిజినెస్ ని ఫైనల్ గా 20 కోట్లకి ఫిక్స్ చేశారు నిర్మాత మరియు దిల్ రాజు కలిసి. దాంతో సినిమా టోటల్ గా 21 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా…
సినిమా మొదటి 8 రోజుల పాటు సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకు పోవడం తో బిజినెస్ లో చాలా వరకు రికవరీ అవ్వడం ఖాయమని అంతా భావించారు, కానీ ఊహించని విధంగా హాలిడేస్ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయిపొయింది వినయ విధేయ రామ సినిమా.
దాంతో సినిమా పడుతూ లేస్తూ ఇప్పుడు 13 కోట్ల కి చేరువ అవుతుండగా ఫైనల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం ఏరియా కి గాను 13.5 కోట్ల లోపు షేర్ తో పరుగును ఆపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దాంతో F2 తో వచ్చిన లాభాలతో ఫుల్ హ్యాప్పీ గా ఉన్న దిల్ రాజు కి ఈ సినిమా ద్వారా టోటల్ గా 6.5 కోట్ల రేంజ్ లో నష్టాలు తప్పేలా లేవు అని చెప్పొచ్చు. మొదటి రోజు సినిమా టాక్ కి నష్టాలు మరీ వీర లెవల్ లో ఉంటాయి అనుకున్నా ఇప్పుడు రేంజ్ తగ్గింది అని సంతోష పడటం ఒక్కటే మిగిలింది అని చెప్పాలి.