Home గాసిప్స్ వినయ విధేయ రామ ఫస్ట్ డే ప్రిడిక్షన్స్…మెగా రాంపేజ్!

వినయ విధేయ రామ ఫస్ట్ డే ప్రిడిక్షన్స్…మెగా రాంపేజ్!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ మరి కొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతుండగా సినిమా కి రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా సినిమా జోరు మాస్ సెంటర్స్ లో ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పొచ్చు. మల్టీ ప్లెక్సులలో కొంచం స్లో గా పికప్ అవుతున్న ఈ సినిమా మాస్ సెంటర్స్ లో మాత్రం కుమ్మేస్తుంది.

ఇక సినిమా థియేటర్స్ కౌంట్ కూడా భారీ గా పెరుగుతున్న నేపధ్యం లో తొలిరోజు కలెక్షన్స్ పై ఆ ప్రభావం చాలా గట్టిగానే కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు సినిమాకి తొలిరోజు చాలా ఏరియాల్లో హైర్స్ కూడా ఉండటంతో…

ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ కి తోడూ తొలిరోజు ఆ హైర్స్ కూడా యాడ్ అయ్యి అవలీలగా 16 నుండి 20 కోట్ల రేంజ్ షేర్ తొలిరోజు రెండు రాష్ట్రాలలో అందుకునే చాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతె ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ అయ్యే చాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి మొదటి రోజు సినిమా జోరు ఎలా ఉంటుందో చూసి అప్ డేట్ చేస్తాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here