Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు డే 2 కలెక్షన్స్..ఇది సరిపోదు!

ఎన్టీఆర్ కథానాయకుడు డే 2 కలెక్షన్స్..ఇది సరిపోదు!

0

      నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 10.15 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 17 కోట్ల రేంజ్ లో ఉండగా రెండో రోజు సినిమాకి మొదటి రోజు థియేటర్స్ లో 35-40% థియేటర్స్ కొత్త సినిమా కి వెళ్లి పోయాయి. అందునా రెండో రోజు కూడా..

వర్కింగ్ డే నే అవ్వడం తో సినిమా ప్రదర్శన అనుకున్న రేంజ్ లో మొదలు కాలేదు, ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొద్దిగా పుంజుకున్నా అది సినిమా రేంజ్ కి సరిపోయే విధంగా లేదనే చెప్పాలి, మొత్తం మీద రెండో రోజు సినిమా ఆక్యుపెన్సీ ఓవరాల్ గా…

30% లోపే ఉందని చెప్పాలి, పాజిటివ్ టాక్ ఉన్నా పోటి లో ఒక్క సినిమానే ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, బయట జరుగుతున్న ఫ్యాన్ వార్స్ సినిమా కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపుతున్నాయని చెప్పాలి. దాంతో సినిమా కలెక్షన్స్ మొత్తం మీద…

అనుకున్న రేంజ్ లో అయితే రావడం లేదనే చెప్పాలి. మొత్తం మీద రెండో రోజు సినిమా నైట్ షోల లో ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే 4 కోట్ల కి అటూ ఇటూ గానే షేర్ ని రెండు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు…. కానీ….

సినిమా బిజినెస్ 70.5 కోట్ల రేంజ్ లో ఉండటం తో 71.5 కోట్ల టార్గెట్ కి ఈ రేంజ్ వసూళ్లు సరిపోవనే చెప్పాలి, ఇక రెండు కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటం, పోటి మరింత పెరుగుతుండటంతో సినిమా ఎంతవరకు తట్టుకుని నిలబడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది, మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూసి అప్ డేట్ చేస్తాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here