టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న వినయ విధేయ రామ పై నెలకొన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. భారీ క్రేజ్ నడుమ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రెస్పాన్స్ నుండి క్రేజ్ మరింతగా పెరిగి పోయింది అనే చెప్పాలి. ముందు ట్రైలర్ కట్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
బోయపాటి రొటీన్ ఫార్మాట్ లోనే సినిమా చేస్తున్నాడు అని, కానీ టాలీవుడ్ లో మాస్ మూవీస్ అంటే ఒక్క బోయపాటి మాత్రమె ముందు ఉంటాడు. అలాంటి బోయపాటి నుండి రంగస్థలం గీత గోవిందం లాంటి మూవీస్ ని ఎక్స్ పెర్ట్ చేయలేం అని తర్వాత అర్ధం చేసుకున్నారు.
దాంతో సినిమా పై మళ్ళీ క్రేజ్ పీక్స్ లో వెళ్లి పోయింది. దానికి తోడూ పోస్టర్స్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేస్తుండటం తో క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగి పోయింది. దాంతో ట్రేడ్ వర్గాలు కూడా ఇప్పటి దాకా ఒకలెక్క..ఇప్పటి నుండి ఒకలెక్క..బాక్స్ ఆఫీస్ ఊచకోతకి సిద్ధం కండి అంటూ చెబుతుండటం తో సంక్రాంతి కి సినిమా రచ్చ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి గా మారింది.