Home న్యూస్ బాలీవుడ్ పరువు కాపాడిన టెంపర్…

బాలీవుడ్ పరువు కాపాడిన టెంపర్…

0

  2018 ఇయర్ అన్ని ఇండస్ట్రీ లకు మంచి ఫలితాలనే అందించింది. కానీ బాలీవుడ్ కి ఫస్టాఫ్ ఇచ్చినంత కిక్ సెకెండ్ ఆఫ్ ఇవ్వలేదు…ఒక్క సంజు తప్పితే మిగిలిన సినిమాలు అన్ని జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయాయి అందులో పెద్ద హీరోల సినిమాలు ఉన్నా నిరాశ పరిచాయి. ఇక డబ్బింగ్ మూవీస్ 2.0 మరియు KGF లు రాజ్యం ఎలాయి. ఇలాంటి సమయంలో ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సింబా అల్టిమేట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కాగా ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ రీమేక్ అవ్వడంతో బాలీవుడ్ కి ఇయర్ చివర్లో ఊపిరి పోసిన సినిమాగా నిలిచిన టెంపర్ కూడా సౌత్ రీమేక్ అవ్వడంతో బాలీవుడ్ లో సెకెండ్ ఆఫ్ మొత్తం మీద సౌత్ సినిమాలదే డామినేషన్ గా మారింది అని అంటున్నారు.

ఎన్టీఆర్ యాక్టింగ్ ని పూర్తిగా కాకున్నా చాలా వరకు మ్యాచ్ చేసి మెప్పించాడు రన్వీర్ సింగ్.. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దూసుకు పోతున్నట్లు సమాచారం…చూస్తుంటే త్వరలోనే 200 కోట్ల క్లబ్ లో చేరే అన్ని అవకాశాలు ఈ సినిమాకి పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here