బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ వార్, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఇండిపెండెంట్స్ డే రోజున మరో పాన్ ఇండియా మూవీ సైరా నరసింహా రెడ్డి తో పోటి పడీ మరీ రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆ సినిమా తో పోల్చుకుంటే రివ్యూ లు యావరేజ్ లెవల్ లోనే వచ్చినా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఈ ఇయర్ నంబర్ 1 మూవీ గా నిలుస్తు 15 రోజుల్లో హిందీ వర్షన్ 271.6 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా తమిళ్ మరియు తెలుగు వర్షన్స్ తో కలుపుకుని సినిమా టోటల్ గా 284.2 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
సినిమా ను ఇండియా లో టోటల్ గా 110 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 210 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా 15 రోజులు ముగిసే సరికి ఏకంగా 284.2 కోట్ల తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా త్వరలో 300 కోట్ల క్లబ్ లో చేరడానికి ఉరకలేస్తూ దూసుకు పోతుంది. ఇక సినిమాను…
తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.6 కోట్లకు అమ్మారు. కాగా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమం 3.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన వార్ సినిమా 15 రోజులు పూర్తీ అయ్యే సరికి తెలుగు రాష్ట్రాలలో తెలుగు వర్షన్ మరియు హిందీ కలెక్షన్స్ కలిపి సినిమా 4.15 కోట్ల షేర్ ని అందుకుంది.
అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి సినిమా ఇప్పటికే 95 లక్షల షేర్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది, టోటల్ రన్ లో 1.1 కోట్ల లోపు ప్రాఫిట్ ని తెలుగు లో సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద తెలుగు లో సూపర్ హిట్ గా, అలాగే టోటల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది వార్ సినిమా…
It’s a magic of hirthik Roshan if we does mass movies it will be the results #hrithik mass