ఈ దీపావళి కి తెలుగు లో స్ట్రైట్ సినిమా లు ఏవి లేక పోవడం తో డబ్బింగ్ సినిమాలు స్వేచ్చగా భారీ ఎత్తున ఇక్కడ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. అందులో ఇలయ దళపతి విజయ్ నటించిన బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో మంచి క్రేజ్ నడుమ రిలీజ్ కానుండగా కార్తీ నటించిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ ఖైదీ పెద్దగా బజ్ లేకుండా నే ఇక్కడ రిలీజ్ కాబోతుంది.
కాగా రెండు సినిమాలకు కలిపి ఆల్ మోస్ట్ 15 కోట్ల లోపు బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగింది, ఇక రెండు సినిమాలు కూడా మేజర్ థియేటర్స్ ని సొంతం చేసుకుని తెలుగు లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ముందుగా విజయ్ నటించిన విజిల్ సినిమా థియేటర్స్ కౌంట్ ని పరిశీలిస్త….
?NIZAM – 210+
?Ceeded – 130+
?Andhra – 250+
AP TG: 590+
రీసెంట్ టైం లో విజయ్ నటించిన సినిమాల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్ ని ఒకసారి పరిశీలిస్తే
?#Theri: 400+
?#Mersal: 420+
?#Sarkar: 600+
లాస్ట్ ఇయర్ సర్కార్ భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఈ సారి పోటి ఉన్నందున కొంచం థియేటర్స్ విజిల్ కి తగ్గాయి అని చెప్పాలి.
ఇక కార్తీ నటించిన ఖైదీ థియేటర్స్ లెక్కలను గమనిస్తే
?NIZAM – 100
?Ceeded – 70
?Andhra – 150+
AP TG: 320+… టోటల్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 480 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. అలాగే విజిల్ సినిమా సుమారు 750 వరకు స్క్రీన్స్ లో ఇక్కడ రిలీజ్ కాబోతుంది. మొత్తం మీద రెండు సినిమాల ఫైనల్ థియేటర్స్ కౌంట్ ని పరిశీలిస్తే
విజిల్ 590 థియేటర్స్ లో ఖైదీ 320 థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా రెండూ కలిపి సుమారు 910 థియేటర్స్ అలాగే 1230 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానున్నాయి. 2 డబ్బింగ్ మూవీస్ కి ఈ రేంజ్ లో థియేటర్స్ అది కూడా దీపావళి పండగ టైం లో దొరకడం అంటే పెద్ద విషయమే… ఇక బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.