Home న్యూస్ పుష్ప నుండి సేతుపతి అందుకే తప్పుకున్నాడా??

పుష్ప నుండి సేతుపతి అందుకే తప్పుకున్నాడా??

0

     స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని దక్కించుకుని సత్తా చాటుకున్నాడు, ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఊపులో ఉన్నాడు. ఇక రంగస్థలం తో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి అంచనాలు భారీ లెవల్ లో పెరిగి పోయాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా కోలివుడ్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నారు అని ఎప్పుడో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సినిమా నుండి విజయ్ సేతుపతి…

కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు అని తెలియగా కొందరు క్యారెక్టర్ నచ్చకనే అని మరి కొందరు రెమ్యునరేషన్ విషయం లో తేడా లు జరగడమే కారణమని సోషల్ మీడియా లో ఎక్కువగా స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే, కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం…

ఇవేవి కారణం కాదని తెలుస్తుంది, ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే… స్వతహాగా ఒకే సమయం లో ఎక్కువ సినిమాలు చేసే అలవాటు ఉన్న విజయ్ సేతుపతి కమిట్ అయిన సినిమాలు చాలా ఎక్కువగా ఉండటం, లాక్ డౌన్ పూర్తీ అవ్వడానికి మరింత ఎక్కువ సమయం పట్టేలా ఉండటం తో… ఇతర సినిమాలకు డేట్స్ ఇష్యూ అవుతుంది అని…

విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అని అంటున్నారు, కానీ ఈ విషయం పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇప్పటికీ రాలేదు. ఇక యూనిట్ ఇప్పుడు కన్నడ లేదా మలయాళ క్రేజీ నటుల్లో ఒకరిని ఆ రోల్ కోసం అనుకుంటున్నారట. వాళ్ళు కుదరక పొతే బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నారు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here