Home గాసిప్స్ బాలయ్య డెడికేషన్….మరీ 25 ఏంటి సామి!!

బాలయ్య డెడికేషన్….మరీ 25 ఏంటి సామి!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫాం కోల్పోయి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 2019 ఇయర్ లో ఏరికోరి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ ఊహకందని డిసాస్టర్స్ అవ్వడమే కాకుండా భారీ నష్టాలను మిగిలించి షాక్ ఇచ్చాయి. ఇక ఇయర్ ఎండ్ లో కమర్షియల్ కంబ్యాక్ ఇద్దామని చేసిన రూలర్ సినిమా కూడా భారీ డిసాస్టర్ అవ్వడం తో లాస్ట్ ఇయర్ ని హాట్రిక్ డిసాస్టర్స్ తో ముగించాడు బాలయ్య.

ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన బాలయ్య తన అప్ కమింగ్ మూవీ కోసం చాలా కష్టమే పడుతున్నాడు అన్నది ఫిలిం నగర్ న్యూస్. తన కి సింహా మరియు లెజెండ్ లాంటి సెన్సేషనల్ కంబ్యాక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను కూడా…

ఇప్పుడు వినయ విదేయ రామ డిసాస్టర్ లో ఉన్నాడు కాబట్టి ఇద్దరూ కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ ని ట్రై చేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో రూపొందే అప్ కమింగ్ మూవీ లో బాలయ్య అఘోరా గా కనిపించబోతున్నారు అన్న వార్తలు చాలా స్ట్రాంగ్ గా…

ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి…. ఇక ఆ పాత్ర కోసం బాలయ్య ఓవరాల్ గా 25 కిలోల బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే 15 కిలోల వరకు బరువు తగ్గారని టాక్ ఉంది. ఇక ఈ సినిమా లో బాలయ్య లుక్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుందని అంటున్నారు.

బోయపాటి శ్రీను కూడా ఈ సినిమా విషయం లో మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుని సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ముందు జులై లో అనుకున్నా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్నారు. మరి ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here