టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన సైరా సినిమా అక్టోబర్ 2 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పోటి లేకుండా రిలీజ్ అవుతుంది అనుకున్నా…
సడెన్ గా బాలీవుడ్ మూవీ వార్ ఇక్కడ కూడా డబ్ అయ్యి రిలీజ్ కాబోతుంది, సైరా తో పోల్చుకుంటే ఈ సినిమా కి ఇక్కడ మరీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ దక్కదు కానీ ఈ సినిమా కోసం అటు నైజాం లో ఇటు ఆంధ్రా లో థియేటర్స్ ని యష్ రాజ్ ప్రొడక్షన్ హౌస్…
ఆల్ రెడీ కొన్ని అగ్రిమెంట్స్ జరిపి రిలీజ్ చేయబోతున్నారట. దాంతో సైరా కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త రికార్డ్ బ్రేకింగ్ థియేటర్స్ కౌంట్ మిస్ అయ్యేలా ఉంది. రీసెంట్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 1380 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కన్ఫాం అయ్యింది.
అది బాహుబలి 2 రిలీజ్ అయిన థియేటర్స్ 1350 కన్నా ఎక్కువ… కానీ ఇప్పుడు వార్ కి నైజాం లో 110 స్క్రీన్స్ అలాగే ఆంధ్రా లో 200 నుండి 250 వరకు స్క్రీన్స్ దొరకబోతున్నాయి. ఇక హాలివుడ్ మూవీ జోకర్ 4 న రిలీజ్ ఉండాల్సింది 2 కి పోస్ట్ పోన్ అవ్వగా ఆ సినిమా కి కూడా 150 వరకు ఓవరాల్ స్క్రీన్స్ దొరికే అవకాశం ఉంది.
మొత్తం మీద ఇంత పోటి ఉన్నా సైరా నరసింహా రెడ్డి కి ఇప్పుడు 1250 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా అని తేలింది. ఫైనల్ కౌంట్ కొంచం అటూ ఇటూ గా ఉన్నా ఇదే కన్ఫాం అవ్వచ్చు అంటున్నారు. నేషనల్ హాలిడే అవ్వడం తో ఆ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో మ్రోత మ్రోగడం ఖాయమని చెప్పొచ్చు.