Home టోటల్ కలెక్షన్స్ జోడి కలెక్షన్స్: అమ్మింది 1.6 కోట్లకు….వచ్చింది ఇది…పాపం!!

జోడి కలెక్షన్స్: అమ్మింది 1.6 కోట్లకు….వచ్చింది ఇది…పాపం!!

0

     సాయి కుమార్ తనయుడు ఆది కి కాలం అస్సలు కలిసి రావడం లేదు, కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నట్లు కనిపించినా ఒక్కసారిగా గాడి తప్పిన ఆది సుకుమారుడు సినిమా నుండి మొదలు కొని ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఫ్లాఫ్స్ ని ఎదురుకుని తనకు ఏర్పడిన చిన్న మార్కెట్ ని కూడా కోల్పోయి ఇప్పుడు తన సినిమా….

రిలీజ్ అవుతున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండానే రిలీజ్ అవుతూ తెలిసే లోపే అవి థియేటర్స్ నుండి బయటికి వెళుతున్నాయి. రీసెంట్ గా బుర్రకథ అనే సినిమా తో వచ్చి వెళ్ళినా ఆది ఆ తర్వాత రీసెంట్ గా మరో సినిమా రిలీజ్ చేశాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

సెప్టెంబర్ మొదటి వారంలో ఆది మరియు జెర్సీ ఫ్రేం శ్రద్ధ శ్రీనాద్ ల కాంబినేషన్ లో జోడి అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అంతే సైలెంట్ గా థియేటర్స్ లో నుండి కూడా వెళ్లి పోయింది.

సినిమా ను టోటల్ గా 1.6 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. ఇక సినిమా 2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ రన్ లో కేవలం 41 లక్షల షేర్ ని మాత్రమె రాబట్టి డిసాస్టర్ గా పరుగును ముగించి ఆది ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా మిగిలి పోయింది.

సినిమా ఏమైనా బాగుంది అంటే టాక్ చాలా వీక్ గా ఉండటం తో థియేటర్ ఓనర్స్ వారం కూడా ప్రదర్శితం అవ్వకుండానే థియేటర్స్ నుండి తొలగించారు. సినిమా బిజినెస్ లోనే ఏకంగా 1.2 కోట్ల ఏమిరా నష్టాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆది ఆశలన్నీ మరో సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ పైనే పెట్టుకున్నాడు. ఆ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here