Home న్యూస్ 3 రోజులు తిరిగేలోపు రిలీజ్ డేట్ చేంజ్…కొత్త డేట్ ఇదే!

3 రోజులు తిరిగేలోపు రిలీజ్ డేట్ చేంజ్…కొత్త డేట్ ఇదే!

0

యాక్షన్ హీరో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కొట్టి చాలా కాలమే అవుతుంది, అప్పుడెప్పుడో 2014 టైం లో లౌక్యం సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ క్లీన్ హిట్ ని అయితే సొంతం చేసుకోలేక పోయాడు… కొన్ని సినిమాలు టాక్ పాజిటివ్ గా సొంతం చేసుకున్నా కానీ…

ఇతర సినిమాల ఫ్లాఫ్ ఎఫెక్ట్ వలన ఆ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల మీద మినిమం బజ్ లేక పోవడం తో అవి కూడా నిరాశ పరిచాయి. ఇలాంటి టైం లో లాస్ట్ ఇయర్ నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ….

సీటిమార్ ఆల్ మోస్ట్ డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా చివరి నిమిషంలో ఇతర సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉన్నంతలో కలెక్షన్స్ వస్తూ ఉండటం తో ధైర్యం చేసి సినిమాను సెప్టెంబర్ 3 న రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కానీ మళ్ళీ కేవలం 3 రోజులు కూడా తిరగకముందే సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసి ఇప్పుడు కొత్త డేట్ ని ఇచ్చారు. ఈ సారి వారం పోస్ట్ పోన్ చేసి సినిమాను సెప్టెంబర్ 10 న వినాయక చవితి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ రోజున రావాల్సిన లవ్ స్టొరీ మరో వారం కానీ నెలాఖరుకు పోస్ట్ పోన్ అయిందని సమాచారం.

దాంతో సీటిమార్ సినిమాను ఆ రోజున ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది. మరో కారణం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు ఈ నెల ఎండ్ టైం కి సెట్ అవుతాయి అనుకున్నా సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ అయింది. దాంతో సెప్టెంబర్ 10 నాటికి పరిస్థితులు సెట్ అవుతాయని ధీమా గా ఉన్నారు సీటిమార్ టీం… మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here