Home న్యూస్ ఇది కన్ఫాం అయితే వర్త్ షేర్ రికార్డులో కల్కి దుమ్ము లేపడం ఖాయం!

ఇది కన్ఫాం అయితే వర్త్ షేర్ రికార్డులో కల్కి దుమ్ము లేపడం ఖాయం!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఓపెనింగ్స్ కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఇక సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా హైర్స్ లాంటివి ఉండే అవకాశం తక్కువే ఉందని తెలుస్తుంది…దానికి కారణం మేకర్స్ హైర్స్ కి ఒప్పుకోవడం లేదని తెలుస్తూ ఉండగా కొన్ని సి డి సెంటర్స్ లో తప్పితే మేజర్ గా హైర్స్ లాంటివి ఉండే అవకాశం తక్కువే అనిపిస్తుంది.

లోక నాయకుడి మాస్….20 నిమిషాలకే ఇన్ని కోట్లు ఏంటి సామి!
హైర్స్ అంటే ఒక ఏరియాని గంపగుత్తుగా ఔట్ రైట్ రేటుకి 3rd పార్టీ బయర్స్ కి అమ్మేస్తారు..ఇక ఆ ఏరియాలో వచ్చే లాభ నష్టాలతో కొన్న వాళ్ళకి ఎలాంటి సంభందం ఉండదు, లాభం వచ్చినా నష్టం వచ్చిన కొన్న వాళ్ళకే…ఆ వచ్చిన రేటుని మాత్రం ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ లేదా రన్ కంప్లీట్ అయ్యాక షేర్ లో కలుపుతారు….

   

ఇప్పుడు కల్కి కి పెద్దగా హైర్స్ విషయంలో ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజు వచ్చే కలెక్షన్స్ లో చాలా మొత్తం వర్త్ షేరే ఉండబోతుంది కాబట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే టాప్ 2 బిగ్గెస్ట్ వర్త్ షేర్ మూవీస్ లో ఒకటిగా కల్కి మూవీ నిలిచే అవకాశం ఎంతైనా ఉంది మొదటి రోజున…

అల్లు అర్జున్-అట్లీ…..80 కోట్ల రగడ….అసలు ఏం జరిగింది అంటే!
ఇది వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ తొలిరోజు 15.44 హైర్స్ అలాగే 58.67 కోట్ల వర్త్ షేర్ ని అందుకుంది, రెండో ప్లేస్ లో ప్రభాస్ సలార్ మూవీ 3.96 కోట్ల హైర్స్ అలాగే 46.33 కోట్ల వర్త్ షేర్ ని అందుకుంది. ఇక ఇప్పుడు కల్కి మూవీ కి చివరి నిమిషంలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ అయినా కూడా రికార్డ్ వర్త్ షేర్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. బాక్ టు బాక్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో రచ్చ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో అంచనాలను కనుక అందుకుంటే ఓపెన్ సోలో రన్ లో అన్ని అడ్వాంటేజ్ లు కలిసి వచ్చి బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది.
“కల్కి2898AD” టోటల్ బిజినెస్…..బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here