కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, తమిళనాడు లో ఆల్ మోస్ట్ 650 వరకు థియేటర్స్ లో 800 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను అసలు పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు, అజిత్ కుమార్ తన సినిమాల కోసం ప్రమోషన్స్ ఎప్పుడూ కూడా పెద్దగా చేసింది లేదు….
కానీ టీం అందరూ తమ తమ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసిన కానీ హీరో వచ్చి ప్రమోట్ చేస్తే సినిమా రేంజ్ మరో లెవల్ కి వెళుతుంది కానీ అలా జరగలేదు, అయినా కానీ ఈ సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా రికార్డ్ లెవల్ లో బిజినెస్ ను ఈ సినిమా….
అన్ని చోట్లా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. తెలుగు లో సినిమా 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా తమిళనాడు లో మొత్తం మీద సినిమా 64.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం…
ఇక కర్ణాటకలో 4 కోట్లు, కేరళలో 2.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్ల దాకా బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా టోటల్ ఇండియా లో సినిమా 76 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద సినిమా కి బిజినెస్ 20 కోట్ల మేర జరిగిందని అంటున్నారు. దాంతో సినిమా అన్నీ కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా….
ప్రీ రిలీజ్ బిజినెస్ దృశ్యా 96 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఏ రేంజ్ లో రికవరీ అవ్వాలి అంటే సినిమా టోటల్ గా 180 కోట్లకి ఏమాత్రం తగ్గని గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది అని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ కలెక్షన్స్ ని రికవరీ చేయగలుగుతుందో చూడాలి ఇక…