సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీ లతో పోల్చితే చిన్న మార్కెట్ గా భావించే ఇండస్ట్రీ కర్ణాటక… కానీ అప్పుడప్పుడు ఇక్కడ కూడా భారీ విజయాలతో దుమ్ము లేపిన సినిమాలు రాగా… రెండేళ్ళ క్రితం వచ్చిన KGF సినిమా మాత్రం చరిత్ర సృష్టించింది. అత్యంత భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అవ్వగా కర్ణాటక లో 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. టోటల్ రన్ లో అన్ని భాషల్లో కలిపి 200 కోట్ల మార్క్…
అందుకున్న సినిమా గా నిలిచి ఊహకందని విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా, మొదటి పార్ట్ అల్టిమేట్ సక్సెస్ తో ఇప్పుడు రెండో పార్ట్ పై విపరీతమైన క్రేజ్ నెలకొనగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ ఎండ్ కల్లా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది.
ఇక మొదటి పార్ట్ టెలికాస్ట్ రీసెంట్ గా తెలుగు లో జరగగా ఆ ప్రమోషన్ లో భాగంగా హీరో యష్ రెండో పార్ట్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు, మొదటి పార్ట్ కన్నా కూడా రెండో పార్ట్ మీ ఊహలకు మించి భీభత్సంగా ఉంటుందని చెబుతూనే….
మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళండి… సినిమా అంతకు మించే ఉంటుంది కానీ ఏమాత్రం తగ్గదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడట. దాంతో సినిమా పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున బడ్జెట్ పెంచి రూపొందిస్తున్న రెండో పార్ట్ ని ఈ ఏడాది..
అక్టోబర్ లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది చెప్పలేం కాబట్టి ఇయర్ ఎండ్ కి క్రిస్టమస్ కానుకగా కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఎప్పుడు వచ్చినా కానీ పరిస్థితులు సద్దుకుంటే ఊహకందని ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పాలి…