Home న్యూస్ 1 గంటలో హైయెస్ట్ ట్వీట్స్…సింహాద్రి ట్రెండ్ మళ్ళీ షాక్ ఇచ్చింది!

1 గంటలో హైయెస్ట్ ట్వీట్స్…సింహాద్రి ట్రెండ్ మళ్ళీ షాక్ ఇచ్చింది!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 17 ఏళ్ళు పూర్తీ చేసు కుంది. ఈ సందర్బంగా సోషల్ మీడియా లో అభిమానులు భారీ ఎత్తున ట్రెండ్ ని మొదలు పెట్టగా ఇది వరకు ట్రెండ్స్ తో పోల్చితే కొద్దిగా స్లోగానే ట్రెండ్ ని మొదలు పెట్టిన ఫ్యాన్స్… మెల్లి మెల్లి గా ట్రెండ్ లో ముందుకు వెళుతున్నారు. కానీ మొదటి గంటలో మాత్రం…

ఒకింత వెనుకబడే ఉన్నారు అని చెప్పాలి…. రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ తో పోల్చితే రేసులో స్లోగా ముందుకు సాగుతున్నారు. ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ విషయం లో కొద్దిగా వెనుకబడిన ఫ్యాన్స్ మొదటి గంటలో అత్యధిక ట్వీట్స్ విషయం లో కూడా కొంచం స్లో అయ్యారు.

ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో మొదటి గంటలో ఏకంగా 2.9 మిలియన్స్ ట్వీట్స్ పోల్ అయ్యి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు సింహాద్రి 17 ఏళ్ల ట్రెండ్ లో 1.1 మిలియన్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ ని మొదటి 60 నిమిషం లో పోల్ చేసి మాకు అందిన రిపోర్ట్ ప్రకారం టాప్ 6 ప్లేస్ ని దక్కించుకున్నారు.

ఓవరాల్ గా మొదటి 60 నిమిషాల్లో హైయెస్ట్ ట్వీట్స్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రెండ్స్ విషయానికి వస్తే…
👉#HappyBirthdayNTR: 2.9M~
👉#8YrsOfGabbarSinghHysteria: 1.8m~
👉#HBDTHALAPATHYVijay: 1.3M~
👉#14YearsForSouthIndiaIHPokiri: 1.1M+
👉#17YearsForIHSimhadri: 1.1M~**
(మరి కొన్ని ట్రెండ్స్ రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ అప్ డేట్ చేస్తాం)

మొత్తం మీద కొంచం స్లో స్టార్ట్ తో షాక్ ఇచ్చిన ఈ ట్రెండ్ 24 గంటల్లో ఇప్పుడు గబ్బర్ సింగ్ ట్రెండ్ లో పోల్ అయిన 13.4 మిలియన్స్ ట్వీట్ రికార్డ్ ను బ్రేక్ చేయడమే ధ్యేయం అంటున్నారు. మరి 24 గంటల్లో ఈ ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలుస్తారో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here