కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అనుష్క శర్మ మరియు కత్రినా కైఫ్ ల కాంబినేషన్ లో ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ జీరో… భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే మరుగుజ్జు అయిన షారుఖ్ కి ఏళ్ళు గడుస్తున్న పెళ్లి అవ్వదు. అలాంటి సమయం లో అనుకోకుండా అనుష్క ని చూసి ఇష్టపడతాడు.
కానీ తను పారలైజ్ అయింది అని తెలుసుకుని కూడా ఇష్టపడతాడు హీరో..అంతా సెట్ అయింది అని అనుకుంటున్న సమయంలో వీరి లైఫ్ లోకి కత్రినా కైఫ్ ఎంటర్ అవుతుంది తర్వాత ఏమైంది అన్నది అసలు కథ. సినిమా మొదటి అర్ధభాగం మొత్తం…
షారుఖ్ నటనతో అలరించే సన్నివేశాలతో ఆకట్టుకోగా ఇక కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అన్న భావన కలిగిస్తుంది, కానీ ఎప్పుడైతే కత్రినా కైఫ్ ఎంట్రీ అవుతుందో అప్పటి నుండి స్టొరీ రూట్ మారిపోతుంది. అప్పటి వరకు ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే మెల్లి మెల్లిగా స్లో డౌన్ అయి బోర్ కొడుతుంది.
మళ్ళీ చివర్లో అంతా సెట్ అయ్యి జస్ట్ ఒకే అనిపించే విధంగా ముగుస్తుంది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది, కానీ ఉన్నంతలో షారుఖ్ అనుష్క ల పెర్ఫార్మెన్స్ తో సినిమా పర్వాలేదు అన్న భావన తో ప్రేక్షకులు థియేటర్స్ నుండి వచ్చేలా చేస్తుంది.
సెకెండ్ ఆఫ్ సినిమా ని గట్టిగా ముంచింది అని చెప్పాలి, దర్శకుడు సెకెండ్ ఆఫ్ ట్రీట్ మెంట్ వేరే విధంగా తీసి ఉంటె రిజల్ట్ వేరేలా ఉండేది. అప్పటికి షారుఖ్ తన నటనతో సినిమాని చాలా వరకు నిలబెట్టాడు. ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ సూపర్ సెకెండ్ ఆఫ్ బ్లండర్ గా మారింది.
దాంతో జస్ట్ ఓకే అనిపించేలా ఉన్న జీరో షారుఖ్ మరుగుజ్జుగా పడిన కష్టానికి అనుష్క పెర్ఫార్మెన్స్ కి కత్రినాకైఫ్ గ్లామర్ కి ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. టోటల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…సెకెండ్ ఆఫ్ బెటర్ గా డీల్ చేసి ఉంటే సినిమా లెవల్ మరో విధంగా ఉండేది.