ఒకటి కొంటే ఒకటి ఫ్రీ….ఇక దంచికొట్టుడే!

0
765

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అన్ని సంక్రాంతి సినిమాల కన్నా కూడా ముందుగా రిలీజ్ ని సొంతం చేసుకోబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది అందరి లోను ఆసక్తి ని రేపుతుంది అని చెప్పాలి.

ఓవర్సీస్ లో కూడా భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి అక్కడ కూడా మరో అడ్వాంటేజ్ దక్కనుంది. AT&T Buy 1 Get 1 Free Ticket ఆఫర్ కింద ఒక టికెట్ కొంటె ఒక టికెట్ సినిమాకి ఫ్రీ గా దక్కనుంది. దాంతో ప్రీమియర్ షో కలెక్షన్స్ ఓ రేంజ్ లో…

ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఒక ఓవర్సీస్ లో ఒక్కో టికెట్ రేటు సుమారు 18$ నుండి 20$ వరకు ఉందని సమాచారం. బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here