Home న్యూస్ డిసెంబర్ లో 1000 కోట్ల యుద్ధం…ఎవరు గెలుస్తారో!!

డిసెంబర్ లో 1000 కోట్ల యుద్ధం…ఎవరు గెలుస్తారో!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ లో ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్ కాబోతుంది….ఒక పక్క బాక్ టు బాక్ రెండు సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అది కూడా ఒక్క ఏడాదే సొంతం చేసుకుని ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ తో సినిమా చేస్తున్న బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఉండగా….

మరో పక్క రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో హిట్ లేక పోయినా కూడా కేజిఎఫ్ సిరీస్ తో మర లెవల్ కి వెళ్ళిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సలార్(Salaar) సినిమా ఉంది. ఈ రెండు సినిమాల మధ్య ఎపిక్ క్లాష్…

ఈ క్రిస్టమస్ టైంలో ఉండబోతుండగా పోటిలో గెలిచేది ఎవ్వరు అనేది ఆసక్తిగా మారింది, సలార్ ఊరమాస్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కాగా డంకి మూవీ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కంప్లీట్ ఎక్స్ పెరిమెంటల్ క్లాస్ టచ్ ఉన్న సోషల్ మెసేజ్ మూవీలా అనిపిస్తూ ఉంది, కానీ ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు…

హీరో సూపర్ ఫామ్ లో ఉన్నాడు, అవి ప్లస్ పాయింట్స్ అయితే సలార్ కేజిఎఫ్ సిరీస్ లో భాగంగా రాబోతున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు మరో లెవల్ లో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ క్లాష్ లో ఏ సినిమా 1000 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది…మీరు ఏ సినిమా ఈ రికార్డ్ ను కొడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here