ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒకప్పుడు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరో విక్టరీ వెంకటేష్, ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సరైన సినిమా పడక పోవడం తో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆదరణ తగ్గిందేమో అని అందరు అనుకున్నారు కానీ మల్టీ స్టారర్ మూవీస్ తో మళ్ళీ జోరు పెంచిన వెంకీ రీసెంట్ టైం లో చేసిన లాస్ట్ 2 మల్టీ స్టారర్ మూవీస్ లో ఫుల్ డామినేట్ చేశాడు.
ముఖ్యంగా ఎఫ్ 2 మరియు వెంకి మామ సినిమాల్లో యంగ్ హీరోలు ఉన్నా వెంకీ డామినేషన్ ఎక్కువ అని చెప్పాలి. ఎఫ్ 2 ఫ్యామిలీ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో థియేటర్స్ కి తేవడంలో వెంకీ పాత్ర ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే సీనియర్ హీరోల్లో
నాగార్జున, చిరు తర్వాత ఇప్పుడు వెంకటేష్ మరో రికార్డ్ కొట్టాడు. ఒక్క క్యాలెండర్ ఇయర్ లో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న హీరోగా నిలిచాడు. సీనియర్స్ లో ముందుగా నాగార్జున 2016 లో సోగ్గాడే చిన్ని నాయన, మరియు ఊపిరి మల్టీ స్టారర్ మూవీ తో ఈ రికార్డ్ కొట్టాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి 2017 లో ఖైదీ నంబర్ 150 మరియు 2019 లో సైరా సినిమాలతో 100 కోట్ల ను 2 సార్లు అందుకుని తానెందుకు మెగాస్టార్ అయ్యాడో చెప్పకనే చెప్పాడు. ఇక వెంకటేష్ ఇప్పుడు 2019 ఇయర్ లో ఎఫ్ 2 తో 84 కోట్లు కి పైగా… ఇప్పుడు వెంకిమామ 3 రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడంతో… 2 సినిమాలు కలిపి ఇప్పటికే…
100 కోట్లు క్రాస్ అవ్వడంతో సీనియర్ హీరోల్లో 100 కోట్ల షేర్ ని ఒక ఇయర్ లో అందుకున్న మూడో హీరో అయ్యాడు. మల్టీ స్టారర్ కాబట్టి ఇద్దరు హీరోలకు క్రెడిట్ వెళుతుంది కానీ ఈ 2 సినిమాలు ఆడియన్స్ విరగబడి చూడటానికి ముఖ్య కారణం వెంకీ నే కాబట్టి క్రెడిట్ ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పాలి. ఇక సోలో హీరోగా వెంకీ సత్తా ఏంటి అనేది అసురన్ తెలుగు రీమేక్ తో తేలనుంది.