Home గాసిప్స్ 100 కోట్ల కన్నప్పలో మార్పులు….అసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇదే!

100 కోట్ల కన్నప్పలో మార్పులు….అసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు…వరుస ఫ్లాప్స్ లో ఉన్నా కూడా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తన కెరీర్ లో బిగ్గెస్ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో…  కన్నప్ప(Kannappa Movie) పేరుతో వస్తున్న ఈ సినిమా…

ఆల్ మోస్ట్ 100 కోట్ల కి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాగా ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార మరియు మరికొంత మంది స్టార్స్ నటిస్తూ ఉండగా లేటెస్ట్ గా సినిమాలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే సినిమాలో కొన్ని మేజర్ మార్పులు జరిగాయి అని టాక్ గట్టిగా వినిపిస్తుంది.

సినిమాలో ముందుగా మహా శివుడి రోల్ లో ప్రభాస్ ను అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రభాస్ ప్లేస్ లో అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తూ ఉండగా పార్వతిగా నయనతార నటిస్తుందట… ప్రభాస్ ఇక నందీశ్వరుడిగా సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు కూడా కీలక రోల్స్ లో నటించబోతున్నారట…

రీసెంట్ టైంలో ఇలా అన్ని ఇండస్ట్రీల నుండి క్రేజీ నటులతో వస్తున్న ట్రూ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందబోతుంది అని చెప్పాలి…. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా లో కొన్ని మార్పులు జరిగినా కూడా కథ అద్బుతంగా ఉంటుందని, విష్ణుకి సాలిడ్ కంబ్యాక్ మూవీగా అలాగే పాన్ ఇండియా రేంజ్ లో సర్ప్రైజ్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అందరూ అంచనా వేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here