మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao Movie), లాస్ట్ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా….
కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోయింది. పోటిలో లియో, భగవంత్ కేసరి లాంటి సినిమాల వలన మూడో ఆప్షన్ గా మారిన టైగర్ నాగేశ్వరరావు మొత్తం మీద రన్ అయిపోయే టైంకి 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 25.50 కోట్లు మాత్రమే రికవరీ చేసి 13 కోట్ల రేంజ్ లో లాస్ తో ఫ్లాఫ్ గా నిలిచింది.
తర్వాత డిజిటల్ లో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వగా అక్కడ మాత్రం మంచి వ్యూవర్ షిప్ తో దూసుకు పోయిన ఈ సినిమా ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది, చాలా వరకు ఫ్లాఫ్ అయిన సినిమాలు యూట్యూబ్ లో…
మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు కూడా హిందీ డబ్ లో 100 మిలియన్ మార్క్ ని అందుకుని రవితేజ ఖాతాలో మరో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం రవితేజ ఓ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.