Home న్యూస్ బిగ్గెస్ట్ సింగిల్ డే ఔట్….బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న చిన్న సినిమా!

బిగ్గెస్ట్ సింగిల్ డే ఔట్….బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న చిన్న సినిమా!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ ఎండ్ టైంలో ఇప్పుడు ఓ చిన్న సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది…స్త్రీ యూనివర్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ముంజ్య(Munjya Movie) సినిమా అసలు స్టార్ కాస్ట్ గురించి కూడా ఎవరికీ పెద్దగా తెలియదు కానీ జస్ట్ ట్రైలర్ రిలీజ్ నుండే…

మంచి హైప్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ప్రతీ రోజూ సూపర్ హోల్డ్ ని చూపిస్తూ మొదటి వారం ప్రతీ రోజు 4 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వీకెండ్ లో సాలిడ్ గా జోరుని చూపిస్తూ ఇప్పుడు 10వ రోజు ఆదివారం బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన 10 రోజుల్లో మొదటి సండే రోజున 8.43 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే రెండో సండే కలెక్షన్స్ ఇంకా పెరిగి 8.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ ని సాధించింది. ఓవరాల్ గా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఇప్పుడు టోటల్ గా…

55.75 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా 11 వ రోజు కలెక్షన్స్ బక్రీద్ పండగ అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపించే అవకాశం ఉండటంతో 60 కోట్ల మార్క్ ని ఈ రోజు అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో 75 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఓ చిన్న సినిమా ఇలాంటి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here