నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో ఎంటర్ అవ్వగా సినిమా 9వ రోజు కొత్త సినిమాల జోరు వలన కొద్దిగా స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక సినిమా ఇప్పుడు 10వ రోజులో ఎంటర్ అవ్వగా వీకెండ్ కూడా స్టార్ట్ అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని…
చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా ఆల్ మోస్ట్ 9వ రోజుకి సిమిలర్ గానే ఇప్పుడు 10 వ రోజున హోల్డ్ చేసింది అని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో. నైజాంలో కొంచం గ్రోత్ కనిపించగా ఆంధ్ర మరియు సీడెడ్ లో మాత్రం పెద్దగా…
ఇంప్రూవ్ మెంట్ కనిపించడం లేదు. అయినా కానీ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 10వ రోజున 80 లక్షల నుండి 85 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్…
ఇంకొంచం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం ఓవర్సీస్ లో గ్రోత్ హెల్ప్ తో ఈ రోజు 1.2 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా మొత్తం మీద ఈ అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి…