Home న్యూస్ 10 ఏళ్ళుగా ఈ రికార్డ్ కొట్టే సినిమా రాలేదు….ఎపిక్ రికార్డ్ కి 10 ఏళ్ళు!

10 ఏళ్ళుగా ఈ రికార్డ్ కొట్టే సినిమా రాలేదు….ఎపిక్ రికార్డ్ కి 10 ఏళ్ళు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో ప్రతీ ఏడాది చాలా హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ వస్తూ ఉంటాయి, ఇయర్స్ వరకే కాదు, ప్రతీ నెలలో కూడా రిలీజ్ అయ్యే సినిమాల పరంగా ఆ నెల లో సాలిడ్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించే సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. దాంతో ప్రతీ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు మార్కెట్ పెరిగిన కొద్ది మారే అవకాశం ఎంతైనా ఉన్నప్పటికీ కొన్ని నెలల విషయంలో…

మాత్రం కొన్ని సినిమాలు ఇప్పటికీ అద్బుతాలు సృష్టించే రేంజ్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించడం జరిగింది, అలాంటి అద్బుతం సృష్టించిన సినిమా నాగార్జున నటించిన డమరుకం సినిమా అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 10 ఏళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర…

కంప్లీట్ చేసుకుంది…. కానీ ఈ సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతూ 10 ఏళ్ళుగా బ్రేక్ అవ్వకుండా ఉండటం విశేషం అని చెప్పాలి. 10 ఏళ్ల క్రితం నవంబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ రన్ లో 26 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర…

సొంతం చేసుకుని పరుగును ముగించగా నవంబర్ నెలలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నింటిలో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ అలానే కొనసాగుతూ వస్తున్నాయి… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బడ్జెట్ 35 కోట్ల రేంజ్ దాకా వెళ్లి మరీ ఎక్కువ అవ్వడంతో ఆ బడ్జెట్ ను రికవరీ చేయలేక పోయిన ఈ సినిమా బడ్జెట్ వైస్ ఫ్లాఫ్ అయినప్పటికీ కూడా భారీ హైప్ తో రావడంతో…

ఆడియన్స్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకుని 26 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. నవంబర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న తెలుగు సినిమాగా నిలిచిన ఈ సినిమా రికార్డ్ ఈ ఏడాది దాకా కొనసాగుతుంది, మరి ఫ్యూచర్ లో అయిన ఈ సినిమా నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏదైనా వస్తుందో లేదో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here