సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో చాలా స్లో డౌన్ అయింది, సోలో రిలీజ్ అయినా బెటర్ కలెక్షన్స్ వచ్చేవేమో కానీ ముందు ఓపెనింగ్స్ దక్కినా తర్వాత తెలుగు సినిమాల పోటి ని తట్టుకోలేక పోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బిలో యావరేజ్ గానే నిలిచి షాక్ ఇచ్చేలా సంక్రాంతి సీజన్ ని పూర్తీ చేసుకుందని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 6L
?Ceeded: 1L
?UA: 2L
?East: 1L
?West: 1L
?Guntur: 1L
?Krishna: 1L
?Nellore: 1L
AP-TG Total:- 0.14CR
ఇక సినిమా మొత్తం మీద 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 4.99Cr
?Ceeded: 1.06Cr
?UA: 1.07Cr
?East: 65L
?West: 45L
?Guntur: 71L
?Krishna: 56L
?Nellore: 40L
AP-TG Total:- 9.89CR(18.12Cr Gross)??
ఇక సినిమా తమిళ్ వర్షన్ కలెక్షన్స్ క్లియర్ గా లేవు కానీ సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సుమారుగా 210 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందని సమాచారం. అందులో తమిళనాడు లో సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందట. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా..
టోటల్ వరల్డ్ వైడ్ గా 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవాలి, అంటే మరో 70 కోట్లకు పైగా గ్రాస్ ని సినిమా అందుకోవాల్సి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 5.11 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది ప్రస్తుతానికి అయితే అసాధ్యంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి వర్కింగ్ డేస్ లో సినిమా ఏదైనా అద్బుతం చేస్తుందో చూడాలి.