Home న్యూస్ అక్షరాలా 1182 కోట్లు…ఇండియాలో ఏ హీరో దరిదాపుల్లో లేడు!!

అక్షరాలా 1182 కోట్లు…ఇండియాలో ఏ హీరో దరిదాపుల్లో లేడు!!

1

బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచాడు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా బిజినెస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ చేశాయి. లాస్ట్ ఇయర్ చేసిన రాధే శ్యామ్(Radhe Shyam)…

అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అవ్వగా ఆ సినిమా ఇంపాక్ట్ తర్వాత కూడా ఇప్పుడు ఆది పురుష్(Adi Purush) మూవీతో సత్తా చాటిన ప్రభాస్ ఏకంగా 240 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుని తన స్టార్ పవర్ ని చూపించాడు.

ఇండియాలో మిగిలిన స్టార్స్ తో పోల్చితే ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు అన్నీ కలిపితే ఏకంగా 1000 కోట్ల మార్క్ ని దాటేసి 1182 కోట్ల మార్క్ ని అధిగమించడం ఊహకందని ఊచకోత అని చెప్పాలి ఇప్పుడు….

ఒకసారి ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
👉#ADIPURUSH – 240CR*****
👉#RadheShyam – 202.80CR
👉#SAAHO – 270CR
👉#Baahubali2 – 352Cr
👉#Baahubali1 – 118Cr
Total Last 5 Movies Business – 1,182.8CR
ఇవీ లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్కలు…

ఇండియాలో మరే స్టార్ కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేడనే చెప్పాలి ఇప్పుడు. ఆది పురుష్ తర్వాత చేస్తున్న సలార్(Salaar) కానీ ప్రాజెక్ట్(Project K) సినిమాలు కూడా ఊహకందని బిజినెస్ ను అందుకునే అవకాశం ఉండగా ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది… మరి ప్రభాస్ ఈ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ రచ్చ చేస్తాడో చూడాలి.

1 COMMENT

  1. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే, బిజినెస్ తగ్గిందనే చెప్పాలి. భాహుబలి తో వచ్చిన క్రేజ్ తో సాహో సినిమాకి మంచి బిజినెస్ (270 cr) వచ్చింది కానీ ఆ తర్వాత తగ్గింది. ఆదిపురుష్ సినిమా బిజినెస్ (240 cr) సాహొ కంటే కూడా తక్కువ, అది కూడా ఆధిపురుష్ సినిమా చాలా ఎక్కువ కేంద్రాల్లో విడుదల చేస్తున్నప్పటికీ సాహొ కంటే తక్కువగా బిజినెస్ అయింది.

Leave a Reply to Ramana Cancel reply

Please enter your comment!
Please enter your name here