Home న్యూస్ రణరంగం కలెక్షన్స్: 16 కోట్లకు అమ్మితే…12 రోజుల్లో వచ్చింది ఇది!

రణరంగం కలెక్షన్స్: 16 కోట్లకు అమ్మితే…12 రోజుల్లో వచ్చింది ఇది!

0

మహానుభావుడు తర్వాత యంగ్ హీరో శర్వానంద్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. లాస్ట్ ఇయర్ పడి పడి లేచే మనసు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన శర్వానంద్ ఈ ఇయర్ రణరంగం అంటూ మాఫియా బ్యాగ్ డ్రాప్ ఉన్న సినిమా తో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత…

  పెద్దగా జోరు చూపలేక పోయింది, కలెక్షన్స్ స్టడీ గా తగ్గుతూ రావడం తో ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసిన రణరంగం కొన్ని రోజుల్లో పరుగును పూర్తిగా ఆపేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…..

2 తెలుగు రాష్ట్రాలలో 12 రోజులకు గాను రణరంగం సినిమా 9.27 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల షేర్ ని సినిమా సాధించింది. ఇవి పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ 12 వ రోజు కేవలం 2 లక్షల షేర్ తోనే సరి పెట్టుకుంది సినిమా. ఇక సినిమా ను మొత్తం మీద…

16 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 6.8 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా…

12 వ రోజు ప్రదర్శన చూస్తుంటే ఈ వారం తో పరుగును పూర్తి చేసుకుని మినిమం 6.5 కోట్ల రేంజ్ లో లాస్ ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. దాంతో శర్వానంద్ ఖాతాలో మరో పరాజయం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here