కామెడీ సినిమాలతో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకుని దూసుకు పోయిన అల్లరి నరేష్ కెరీర్ లో ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ తర్వాత కంబ్యాక్ ఎలాగోలా చేశాడు కానీ ఒకప్పుడు ఇయర్ కి మూడు నాలుగు సినిమాలతో ఫుల్ జోష్ చూపాడు. అన్నీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ప్రతీ ఇయర్ మినిమం రెండు హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్న టైం లో ఒక టికెట్ పై 100 సినిమాల కాన్సెప్ట్ తో…
అనేక సినిమాల స్పూఫ్ లను ఒకే సినిమాలో కథలా మార్చి తమిళ్ లో తమిళ్ పదం అనే సినిమా ను తెలుగు రీమేక్ రైట్స్ ను భీమినేని శ్రీనివాసరావ్ తీసుకుని అల్లరి నరేష్ తో ఈ రీమేక్ ని చేయాలనీ ఫిక్స్ అవ్వగా కథ కి అల్లరి నరేష్ 100% న్యాయం చేసి…
అనేక గెటప్స్ లో అదరగొట్టి చేసిన సినిమా సుడిగాడు బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించి 12 ఏళ్ళు పూర్తీ అయింది. 2012 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోగా ట్రైలర్ సూపర్ హిట్ అవ్వడం తో సిన్నిమా కి ఏకంగా…
స్టార్స్ నటించిన సినిమాల రేంజ్ లో బజ్ ఏర్పడింది. అల్లరి నరేష్ కెరీర్ లో అప్పటికి హైయెస్ట్ అనిపించే విధంగా 8 కోట్ల బిజినెస్ నను సొంతం చేసుకుని బరిలోకి దిగిన సుడిగాడు సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారంలోనే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని వచ్చి లాంగ్ రన్ లో ఏకంగా 18 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆ టైం లో…
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉన్న టైం లో కూడా సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను దక్కించుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత అల్లరి నరేష్ పై క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగి పోగా మళ్ళీ అలాంటి రేంజ్ లో హిట్ ని ఇప్పటికీ సొంతం చేసుకోలేదు అల్లరి నరేష్. ఫ్యూచర్ లో అయినా సొంతం చేసుకోవాలని కోరుకుందాం…