టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా భారీ షాక్ లే ఇస్తుంది. సినిమా అల్ట్రా పాజిటివ్ ఉన్నా కానీ వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ సాలిడ్ గా ఉండటం అందరికీ షాక్ ఇస్తుంది, పోటి లో ఎలాంటి సినిమా లేకున్నా కానీ వర్కింగ్ డేస్ లో మినిమమ్ కలెక్షన్స్ ని అందుకోవడానికి కష్టపడుతుంది సినిమా..
ఒక్క తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే మంచి వసూల్లె అని చెప్పాలి కానీ అన్ని వర్షన్స్ కలిపి చూస్తె మాత్రం ఇది మామూలు షాకింగ్ కలెక్షన్స్ కావు అని చెప్పోచ్చు, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 13 వ రోజు మొత్తం మీద 1.09 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేయగా…
14 వ రోజు మరో వర్కింగ్ డే అవ్వడం తో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మరింత స్లో అయింది, సినిమా ఓవరాల్ గా 13 వ రోజు తో పోల్చితే 30% కి మించి డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా యావరేజ్ గా ఉండటం తో మొత్తం మీద సినిమా…
14 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లే తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే ఇది మంచి కలెక్షన్స్…. కానీ అన్ని చోట్లా కలెక్షన్స్ తో కలిపి చూస్తె అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా చాలా దూరం లోనే ఉండటం తో సినిమా..
సాధిస్తున్న ఈ కలెక్షన్స్ ఎంత మాత్రం సరిపోవు అనే చెప్పాలి. కాగా రెండు వారల తర్వాత దాదాపు అన్ని చోట్లా టికెట్ రేట్లు అన్ని చోట్లా నార్మల్ రేటు కి రానున్నాయి కాబట్టి 15 వ రోజు నుండి కొంచం గ్రోత్ కనిపించే అవకాశం ఉందని చెప్పాలి. ఇక 2 వారల టోటల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.