మొదటి 10 రోజుల పాటు అన్ సీజన్ లో కూడా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని మాస్ రాంపెజ్ ను చూపించిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఇప్పుడు రెండో వీక్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న సినిమా రెండో వీక్ లో వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా…
ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపెడుతూ లాభాలను కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా 13వ రోజుతో పోల్చితే 14వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 26-28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది..
ఇక వరల్డ్ వైడ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 34 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా రెండు వారాలను సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక సినిమా మూడో వీక్ లో కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించవచ్చు. ఇక టోటల్ గా 2 వారాల ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.