Home న్యూస్ రికార్డుల జాతర సృష్టిస్తున్న ఆవేశం….18 రోజుల్లో మెంటల్ మాస్ కలెక్షన్స్!

రికార్డుల జాతర సృష్టిస్తున్న ఆవేశం….18 రోజుల్లో మెంటల్ మాస్ కలెక్షన్స్!

0

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు పోతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి రీసెంట్ గా నాన్ స్టాప్ హిట్స్ వస్తూనే ఉండటం విశేషం. లేటెస్ట్ గా అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa Part 1) లో విలన్ గా చేసి తెలుగు వారికి చేరువ అయిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం(Aavesham Movie) సినిమా….

మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫహాద్ ఫాజిల్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. అద్బుతమైన లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిన తర్వాత కూడా…

ఈ సినిమా దూకుడు తగ్గలేదు. ఇప్పుడు 18 రోజులు పూర్తి అయ్యే టైంకి ఏకంగా 127 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. కేరళలో 59.8 కోట్లు, తమిళనాడులో 7.5 కోట్లు, కర్ణాటకలో 9 కోట్లు ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.75 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా ఇండియాలో టోటల్ గా 79.05 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఊహకందని రేంజ్ లో జోరు చూపించిన ఈ సినిమా 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 127 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 18 రోజుల్లో ఫహాద్ ఫాజిల్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ రికార్డులను నమోదు చేసింది.

ఇప్పటికీ స్టడీ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉన్న ఈ సినిమా టోటల్ రన్ లో 135 కోట్ల నుండి 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాను తెలుగు లో త్వరలో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ కూడా క్లిక్ అయితే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here