Home గాసిప్స్ 150 కోట్ల రేటు…ఇండియాలో హైయెస్ట్…..వీళ్ళు ఏమంటారో మరి!!

150 కోట్ల రేటు…ఇండియాలో హైయెస్ట్…..వీళ్ళు ఏమంటారో మరి!!

0

6 నెలల నుండి థియేటర్స్ తెరచుకోలేదు, మరో నెల రోజుల పాటు తర్వాత కూడా తెరచుకుంటాయో లేదో అన్న క్లారిటీ కూడా లేదు, ఇలాంటి టైం లో చాలా వరకు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే సిద్ధం అవుతుండగా… ఇండియా లో ఇప్పటి వరకు రిలీజ్ కన్ఫాం చేసుకున్న డైరెక్ట్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ మూవీ హైయెస్ట్ రేటు దక్కించుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది….

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 125 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. దాంతో ఇండియా లో హైయెస్ట్ రేటు సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు మరో సినిమా కి దక్కింది.

క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న 83 వరల్డ్ కప్ మూవీ ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కరోనా వల్ల కుదరలేదు, మిగిలిన సినిమాలు అన్ని కూడా డైరెక్ట్ రిలీజ్ ని కన్ఫాం చేసుకున్నా ఈ సినిమా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతుందని కన్ఫాం చేశారు.

ఇయర్ ఎండ్ కి అనుకున్నా అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది ఇంకా క్లారిటీ లేక పోవడం జనాలు వస్తారో రారో అన్న డౌట్ తో పాటు లేటెస్ట్ గా బాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ కేసులలో దీపిక పేరు కూడా రావడం లాంటివి మరింత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉండగా ఈ సినిమా కి సాలిడ్ ఆఫర్ దక్కిందట.

ఇండియా లో ఇప్పటి వరకు ఏ సినిమా కి దక్కని రేంజ్ లో ఈ సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కి గాను ఏకంగా 150 కోట్ల రేంజ్ ఆఫర్ ని ఇచ్చిందట టాప్ OTT… ఇక పరిస్థితులను అర్ధం చేసుకుని ఈ రికార్డ్ రేటు కి ఓకే అంటారో లేక థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని అంటారో అన్న నిర్ణయం యూనిట్ నుండి రిలీజ్ అవ్వాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here